ఐ బొమ్మ రవిపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. పైరసీపై కీలక ప్రకటన

9386చూసినవారు
ఐ బొమ్మ రవిపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..  పైరసీపై కీలక ప్రకటన
దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఐ బొమ్మ రవిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్‌తో పోల్చడాన్ని ఆర్జీవీ తీవ్రంగా ఖండించారు. రాబిన్ హుడ్ హీరో కాదని, పైరసీ చేసేవారిని పట్టుకోవడం కష్టమైనా, పైరసీ కంటెంట్ చూసేవారిని పట్టుకోవడం సులభమని ఆయన స్పష్టం చేశారు. సమయం ఆదా చేసుకోవడానికి తాను కూడా పైరసీ కంటెంట్ చూస్తానని ఆర్జీవీ వెల్లడించారు.