ధనిక తెలంగాణను అప్పులపాలు చేశారు: కిషన్ రెడ్డి

46చూసినవారు
ధనిక తెలంగాణను అప్పులపాలు చేశారు: కిషన్ రెడ్డి
TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ధనిక తెలంగాణను అప్పులపాలు చేశాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని నల్లకుంట డివిజన్ వెంకటేశ్వర్ నగర్లో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన.. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూములు అమ్మడం, అప్పులు చేయడమే కాంగ్రెస్ అసలు ఆలోచన అని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్