ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ రిహన్నా, తన బృందంతో కలిసి భారత పారిశ్రామికవేత్త ముఖేష్
అంబానీ నివాసానికి విచ్చేసి,
అంబానీ కుటుంబంతో మధ్యాహ్న విందులో పాల్గొన్నారు. ఇషా
అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్
అంబానీ దంపతులు ఆమెకు స్వాగతం పలికారు. రిహన్నా భారతీయ నృత్య రీతులు, సంప్రదాయ కళలు, సంస్కృతి గురించి తెలుసుకున్నారు.
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో తన సొంత బ్యూటీ బ్రాండ్ 'ఫెంటీ బ్యూటీ' ప్రమోషన్ కోసం ఆమె భారత్‌కు వచ్చారు.