విజయవాడలో కలకలం.. వైసీపీ నేత గౌతమ్‌ రెడ్డి కారుకు నిప్పు (వీడియో)

16చూసినవారు
AP: వైసీపీ నేత గౌతమ్‌ రెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 12వ తేదీన విజయవాడలోని గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారుపై ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు కనిపించినప్పటికీ, అతడిని గుర్తించలేకపోతున్నామని పోలీసులు తెలిపారు. గౌతమ్‌ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్