పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్

12344చూసినవారు
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్
AP: గోదావరిలో నీటిమట్టం పెరగడంతో పాపికొండుల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అల్లూరి జిల్లా దేవిపట్నం నుంచి ఈ యాత్రను జలవనరుల శాఖ అధికారులు నిలిపివేశారు. వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. దేవిపట్నం మండలంలోని రెండు గ్రామాల మధ్య రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటిమట్టం తగ్గిన తరవాత విహారయాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్