ఈ ఏడాది మార్చి నుండి మే వరకు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటవచ్చని అంచనా వేసింది. ఫిబ్రవరిలోనే ఎండలు ముదురుతున్న సంకేతాలు కనిపించాయి. ఏప్రిల్ నుంచి మే వరకు పరిస్థితి విషమించనుంది. సగటున 3 నుండి 15 రోజుల వరకు తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని, దీనివల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఐఎండీ హెచ్చరించింది.