TG: హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి రోడ్డులో ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డుపై
విద్యార్థులు వేలాడుతూ ప్రయాణించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లర్ నంబర్ 203 సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అరకొర బస్సులు, ముఖ్యంగా గ్రామీణ, శివారు ప్రాంతాల్లో తక్కువ సర్వీసులు, రద్దీ వేళల్లో విద్యార్థుల రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.