నేపాల్‌లో డేంజర్‌ మార్క్‌ దాటిన నదులు

98చూసినవారు
నేపాల్‌లో డేంజర్‌ మార్క్‌ దాటిన నదులు
నేపాల్‌లో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి సున్ కోషి, బుధి గండకి, మహాకాళి నదులలో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని దాటాయి. లామ్‌జంగ్ జిల్లాలోని మార్శ్యాంగ్డి నదిలో కూడా నీటి మట్టం మంగళవారం అర్ధరాత్రి ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ సూచించింది.

సంబంధిత పోస్ట్