ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. భారత్‌కు చెందిన 8 నెలల గర్భిణి మృతి

80చూసినవారు
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. భారత్‌కు చెందిన 8 నెలల గర్భిణి మృతి
సిడ్నీలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డును దాటుతున్న సమయంలో అతివేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టడంతో భారత్‌కు చెందిన 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్ మృతి చెందింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన ఆమె భర్త, కుమారుడితో పార్క్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన సమన్వితను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. గర్భంలోని శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా, సమన్విత స్థానిక సాఫ్ట్‌వేర్ సంస్థలో టెస్ట్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు.