కేరళలో రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప భక్తులు మృతి

15చూసినవారు
కేరళలో రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప భక్తులు మృతి
కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. తిరుపతి జిల్లా కండ్రిగ మండలం కారణికి చెందిన వేణు, అతని కుమార్తె చాతుర్య, కొడుకు రాజేశ్‌తో కలిసి కారులో శబరిమల యాత్రకు వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం మంగళవారం స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. కేరళలోని పెరియకుళం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేశ్ (28), డ్రైవర్ వేణు (58) మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్