TG: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం రైలింగ్ బోర్డును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా, వాహనంలో ఉన్న మరికొందరు గాయపడ్డారు. అయితే, వాహనంలో లాక్ చేయబడిన సుమారు 200 గొర్రెలు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.