మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ముంబై నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న మార్గంలో ఇథనాల్‌తో వెళ్తున్న కంటైనర్ ట్రక్కు బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రక్కు కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదం విరుల్ గ్రామం సమీపంలో తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.