భువనేశ్వర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఓ తండ్రీకూతుళ్లు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. పలాసునీ బ్రిడ్జ్‌పై జరిగిన ఈ ఘటనలో ట్రక్కు కారును 600 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రీకూతుళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.