రోడ్డు ప్రమాదం.. బయటపడ్డ గంజాయి దందా

4చూసినవారు
రోడ్డు ప్రమాదం.. బయటపడ్డ గంజాయి దందా
AP: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం కారణంగా అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఒంగోలు నగర సమీపంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. అనుమానం వచ్చిన పోలీసులు లారీని క్షుణ్నంగా తనిఖీ చేశారు. లారీలో తవుడు బస్తాల కింద దాచిన సుమారు 500 కేజీలకు పైగా గంజాయిని పోలీసులు గుర్తించారు. మన్యం ప్రాంతం నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. పరారైన డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.