కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న నలుగురు మైనర్లను కారు ఢి కొట్టడంతో మృతి చెందారు. మృతులు మెహ్రాన్ (13), రెహాన్ (8), ఫైసల్ (11), అద్నాన్ పాషా (9)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనాస్థలానికి పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.