ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. షాపింగ్ కాంప్లేక్స్‌లో ప్రవేశించిన వ్యక్తి ఓ బాలికను పట్టుకుని చంపేస్తానంటూ కత్తితో బెదిరించారు. అలాగే కొన్ని డిమాండ్లు చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దుకాణంలోకి వచ్చి నిందితుడు అజిత్ బాల్ గోవింద్‌ను అరెస్ట్ చేశారు. దీంతో దుకాణంలో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.