చెన్నైలోని కాలడిప్పేటైలో భర్తకు తెలియకుండా అప్పు చేసి, దానిని తీర్చేందుకు నగల దుకాణంలో చోరీకి యత్నించిన ఓ మహిళ పట్టుబడ్డారు. బుర్ఖా వేసుకుని నగలు కొనడానికి వచ్చినట్లు నటించిన జయచిత్రా అనే మహిళ ఓనర్ దేవ్‌రాజ్‌పై కారంపొడి చల్లి, కత్తితో దాడి చేయబోయింది. అయితే షాపు సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.