చైనా కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన Unitree G1 రోబోట్ కిచెన్‌లో పనిచేస్తుండగా నేలకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బౌల్‌ను సరిగా పట్టుకోలేక రోబో నేలపై పడిపోయింది. ఈ దృశ్యాలను పలువురు యూజర్లు ట్విట్టర్ (X)లో పంచుకుంటున్నారు. వీడియోలో రోబో వంట చేస్తూ పాత్రని సరిగ్గా పట్టుకోలేక వదిలేయడం, తర్వాత కిచెన్‌లో చెల్లాచెదురుగా పడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో నిజమా లేదా AI ద్వారా సృష్టించబడిందా అనే అంశంపై స్పష్టత లేదు.