
గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే!
సాధారణంగా గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఉండటానికి కారణం.. ఎరుపు రంగును హెచ్చరిక చిహ్నంగా భావించడం. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లో మండే వాయువు ఉంటుంది, ఇది ప్రమాదకరం. వినియోగదారుల భద్రత కోసం, అలాగే ఎరుపు రంగును దూరంగా ఉన్నా సులభంగా గుర్తించవచ్చు కాబట్టి ఈ రంగును ఉపయోగిస్తారు. గ్యాస్ వాసన లేకపోతే లీకేజీని గుర్తించడం కష్టం. ప్రమాదాలను నివారించడానికి, గ్యాస్లో ఇథైల్ మోర్కాంప్టన్ కలిపి వాసన వచ్చేలా చేస్తారు. దీనివల్ల గ్యాస్ లీకైతే వెంటనే గుర్తించి జాగ్రత్త పడవచ్చు.




