పోలాండ్ రాజధాని వార్సాలో మానవుల ఉద్యోగాల రక్షణ కోసం హ్యూమనాయిడ్ రోబోలు, రోబోటిక్ కుక్కలు వినూత్న నిరసన చేపట్టాయి. 'డెమోక్రాటిజమ్ ఇనిషియేటివ్', 'డెల్టా రోబోట్స్' ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ భవిష్యత్తులో మానవుల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రమాదం ఉందని నిర్వాహకుడు గ్రెగోర్జ్ కులిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను డిజిటల్ వ్యవహారాల మంత్రి క్రిష్టోఫ్ గావ్కోవ్స్కీ సందర్శించారు.