
గ్రీస్ దేశంలో 1000 ఉద్యోగాలు.. టామ్ కామ్కు గ్రీస్ అధికారుల విజ్ఞప్తి
గ్రీస్ దేశంలో వివిధ విభాగాల్లో 1000 ఉద్యోగాలు ఉన్నాయని అర్హత కలిగిన నిరుద్యోగులను పంపాలని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్)ను గ్రీస్ అధికారులు కోరారు. హౌస్ కీపింగ్, వెయిటర్స్, కుక్స్ తదితర వంటి పోస్టులకు డిప్లొమా లేదా హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ, ప్రభుత్వ ట్రైనింగ్ సెంటర్ల నుంచి స్కిల్ సర్టిఫికెట్లు అర్హతలుగా పేర్కొన్నారు. 21 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులు. వసతి, భోజనం, వైద్య బీమా ఉచితం. tomcom.resume@gmail.com కు రెజ్యూమెలను పంపగలరు.




