టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ స్వదేశంలో వన్డే క్రికెట్లో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ ఘనతతో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. రెండవ స్థానంలో క్రిస్ గేల్ (147 సిక్సర్లు), మూడవ స్థానంలో మార్టిన్ గప్టిల్ (132 సిక్సర్లు), బ్రెండన్ మెక్కల్లమ్ (126 సిక్సర్లు), ఎంఎస్ ధోని (123 సిక్సర్లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు.