టీమ్
ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 10,000 పరుగులు (202 ఇన్నింగ్స్) చేసిన ఓపెనర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (214 ఇన్నింగ్సులు) పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టారు. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్, జయసూర్య, క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ క్లబ్‌లో చేరారు.