భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలోకి మరో ప్రపంచ రికార్డు చేరింది. భారత్ ఆడిన అన్ని ఐసీసీ టోర్నమెంట్లలో జట్టును ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్, 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలలో టీమిండియా ఫైనల్‌కు చేరింది. దీంతో రోహిత్ ఫ్యాన్స్, టీమిండియా అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.