
పాక్‌కు సైనిక రహస్యాలు.. రాజస్థాన్ వ్యక్తి అరెస్ట్
సోషల్ మీడియాలో పరిచయమైన యువతి వలలో పడి భారత రక్షణ రంగ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసిన రాజస్థాన్‌కు చెందిన మంగత్ సింగ్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం అతనికి సోషల్ మీడియాలో పరిచయం కాగా అతడిని ముగ్గులోకి దింపింది. అల్వార్ ఆర్మీ కంటోన్మెంట్, పలు ఇతర ఆర్మీ స్థావరాల లొకేషన్స్ చేరేవేసాడు. దీనికి ఆమె నుంచి డబ్బు కూడా తీసుకున్నాడు. ఆ మహిళ పాక్ ఇంటర్నల్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ ఉద్యోగిగా తేలింది.




