కేరళ సీఎంతో రొనాల్డో సోదరి భేటీ.. వీడియో వైరల్

10చూసినవారు
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో భారత్‌లో పర్యటించారు. కేరళ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వి.డి. సతీశన్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కోజికోడ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎంను కలిసిన ఎల్మా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎం సతీశన్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నారు. కేరళలో రొనాల్డోకు అభిమానులు ఎక్కువగా ఉన్నారని, ఫుట్‌బాల్‌కు ఇంత ఆదరణ ఉందని తెలియదని ఎల్మా పేర్కొన్నారు. ఈ విషయాన్ని రొనాల్డోతో పంచుకుంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్