ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పైకప్పు పెచ్చులు

4584చూసినవారు
TG: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంల్లో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఇటీవల ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి మీద పడడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్