'రూట్' సంచ‌ల‌న నిర్ణ‌యం.. క్రికెట్‌కు గుడ్‌బై

26చూసినవారు
'రూట్' సంచ‌ల‌న నిర్ణ‌యం.. క్రికెట్‌కు గుడ్‌బై
ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ సోదరుడు, గ్లామోర్గాన్ స్టార్ బిల్లీ రూట్ ఈ ఏడాది డొమాస్టిక్ సీజన్ తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల బిల్లీ రూట్ 2017లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున అరంగేట్రం చేసి, 2019లో గ్లామోర్గాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ్లామోర్గాన్ వన్డే కప్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రూట్, 83 ఫస్ట్-క్లాస్, 60 లిస్ట్-ఎ, 50 టీ20 మ్యాచ్‌లలో 6406 పరుగులు సాధించాడు. పేలవ ఫామ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం కొలిన్ ఇంగ్రామ్ కూడా క్రికెట్ నుంచి వైదొలిగాడు.

సంబంధిత పోస్ట్