హైదరాబాద్ మహానగరంలో పర్యాటకంతో పాటు ప్రజారవాణాకు రోప్‌వేల ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వారణాసి మోడల్‌ను అనుసరించి, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) ఈ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రభుత్వానికి పాలసీ మార్పుల కోసం ప్రతిపాదనలు పంపారు. పీపీపీ విధానంలో నిర్మించాలని యోచిస్తున్నారు. తొలుత గోల్కొండ నుంచి టూంబ్స్ వరకు, ఆపై జూ వరకు రోప్‌వే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు ఇది పరిష్కారమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.