
ప్రపంచ రికార్డు నెలకొల్పిన కుల్దీప్ యాదవ్
ఢిల్లీలో జరుగుతున్న భారత్ - వెస్టిండీస్ రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో తన టెస్ట్ కెరీర్లో ఐదో సారి ఐదు వికెట్ల హాల్ సాధించడమే కాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఐదు సార్లు 5 వికెట్ల హాల్ సాధించిన ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం 15వ టెస్టులోనే ఈ ఘనత సాధించి గతంలో ఇంగ్లాండ్‌కు చెందిన జానీ వార్డిల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.




