TG: ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప్ సభలో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది. రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలను ప్రభుత్వం మోసం చేసింది. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు ఆర్‌ఆర్ ట్యాక్స్ కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి' అని అన్నారు