ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. కొత్త తేదీలివే

13070చూసినవారు
ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. కొత్త తేదీలివే
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్-డీ కంప్యూటర్ బేస్డ్ పరీక్షల నూతన షెడ్యూల్ విడుదలైంది. నియామక ప్రక్రియకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా వాయిదా పడ్డ పరీక్షలు 2025 నవంబర్ 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష రాయాల్సిన నగరం, తేదీ వంటి ప్రాథమిక సమాచారం బుధవారం నుంచి అందుబాటులో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత ప్రయాణ ధృవీకరణ పత్రం కూడా లభిస్తుంది. అడ్మిట్ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు జారీచేస్తారు.

సంబంధిత పోస్ట్