రూ.1.45 కోట్ల హవాలా డబ్బు మాయం.. 11 మంది పోలీసులు సస్పెండ్

74చూసినవారు
రూ.1.45 కోట్ల హవాలా డబ్బు మాయం.. 11 మంది పోలీసులు సస్పెండ్
మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన రూ.1.45 కోట్ల హవాలా డబ్బును మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మాయం చేశారు. ఈ ఘటన జబల్పూర్‌లో చోటుచేసుకుంది. పై అధికారులకు లెక్కలు చూపడంలో తేడా రావడంతో విషయం బయటపడగా.. రంగంలోకి వచ్చిన అధికారులు 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరి వద్ద ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసుపై దర్యాప్తు కోసం ప్రత్యేక SIT బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్