TG: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు కొల్లగొట్టారని సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం సిరిసిల్ల సభలో మాట్లాడుతూ.. 'కేసీఆర్ బంధువులైన రవీందర్‌రావు, సంతోష్‌రావు మానేరు ఇసుక దొంగలు. మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్‌రావు, సంతోష్‌రావు, కేటీఆర్ వేల కోట్లు దోచుకున్నారు. ముంపు బాధితుల ప్యాకేజీ కోసం ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టారు. ముంపులో కొంప పోయిన సంతోష్‌రావు రూ.10 వేల కోట్లు ఎలా సంపాదించారు' అని ప్రశ్నించారు.