TG: హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ తన కంచిపట్టు చీరకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం “బీ డిజైన్ ఫర్ యు” అనే షాపులో ఇచ్చారు. అయితే, తర్వాత షాప్ నుంచి ఆమెకు ఫోన్ చేసి బ్లౌజ్ మెటీరియల్ తప్పుగా కట్ అయ్యిందని, దాన్ని మగ్గం వర్క్‌తో సరిచేస్తామని తెలిపారు. కానీ చివరికి తయారైన బ్లౌజ్ ధరించలేని స్థితిలో ఉండటంతో బాధితురాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును పరిశీలించిన కమిషన్, షాప్ సేవలో లోపం ఉన్నట్లు నిర్ధారించి, రూ.లక్ష జరిమానా విధించింది. బాధితురాలికి నష్టపరిహారంగా అందజేసింది.