గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల: మంత్రి అడ్లూరి

6చూసినవారు
గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల: మంత్రి అడ్లూరి
గోదావరి పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు తొలి విడత విడుదల చేసింది. ఈ నిధులను పుష్కర ఘాట్లు, రోడ్లు, పారిశుధ్య, మంచినీటి వసతులు, దేవాలయాల పునర్నిర్మాణం చేపడతామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో అధికారులతో కలిసి పుష్కరాల పనులపై చర్చించారు. వెల్గటూర్ నుండి రాజక్కపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం, అయ్యప్ప స్వామి ఆలయం వద్ద బోటింగ్ సౌకర్యం కల్పించాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్