TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో దినసరి కూలీలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీలు పోస్టర్లు అంటించడం, ఇంటింటి ప్రచారం వంటి పనులకు రోజుకు రూ. 400-800 వరకు చెల్లిస్తూ, భోజనం కూడా అందిస్తున్నాయి. విద్యార్థులకు రూ. 1000 చొప్పున చెల్లిస్తుండటంతో, వారు కూడా ఈ ప్రచార కార్యక్రమాలపైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో కూలీల అడ్డాలు ఖాళీగా మారుతున్నాయి.