శ్రీఉత్తరాది పీఠానికి చెందిన శ్రీసత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతి సందర్భంగా ఆగస్టులో కేంద్రం 40 గ్రాముల వెండితో తయారు చేసిన రూ.108 నాణేన్ని విడుదల చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన నాణేల సేకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ హైదరాబాద్ టంకశాల నుంచి రూ.11,461 చెల్లించి ఈ నాణేన్ని కొనుగోలు చేశారు.