వైసీపీ నేత చెవిరెడ్డి పేరు చెప్పి రూ.18 కోట్లు టోకరా

36చూసినవారు
AP: వైసీపీ నేత పేరు చెప్పి.. తక్కువ ధరకు బంగారం, ఇచ్చిన డబ్బుకు రెట్టింపు ఇస్తానని మోసం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన విద్య అనే మహిళ 2022లో సికింద్రాబాద్‌లో ఉండేది. ఆ సమయంలో ఓ వైసీపీ నేత పేరు చెప్పి.. స్థానిక మహిళల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈ క్రమంలో పలువురి నుంచి దాదాపు రూ.18 కోట్లు తీసుకుంది. బాధితులు డబ్బులు అడగడంతో దాడికి దిగింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్