ఏపీలో 'ఆడబిడ్డ నిధి' పథకం కింద మహిళలకు దసరా కానుకగా రూ.18,000 జమకానుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన 'సూపర్ సిక్స్' హామీలలో భాగంగా 18 నుంచి 59 ఏళ్ల వయసు గల అర్హులైన బీపీఎల్ మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున (ఏడాదికి రూ.18,000) ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. అయితే, దసరా నాటికి రూ.18,000 జమ చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల కానున్నట్లు సమాచారం.