నకిలీ కొరియర్ మెసేజ్‌తో రూ.2.47 లక్షలు మాయం

0చూసినవారు
నకిలీ కొరియర్ మెసేజ్‌తో రూ.2.47 లక్షలు మాయం
సికింద్రాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి కొరియర్ సంస్థ పేరుతో వచ్చిన నకిలీ మెసేజ్‌ను నమ్మి రూ.2.47 లక్షలు పోగొట్టుకున్నాడు. 'మీ పార్సిల్ రెండోసారి డెలివరీ ఫెయిల్' అంటూ వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో అతని ఫోన్ హ్యాంగ్ అయింది. వెంటనే క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు డెబిట్ అయినట్లు మేసేజ్‌లు వచ్చాయి. అప్రమత్తమైన బాధితుడు కార్డును లాక్ చేసి, బ్లాక్ చేయించుకున్నాడు. ఈ ఘటనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్