పీఎం కిసాన్ యోజన కింద 21వ విడత రూ. 2,000 కోసం దేశ రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ విడత చెల్లింపులు దీపావళి పండుగకు ముందే, అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సాయం రైతుల ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట విత్తనాల అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది. అయితే, డబ్బులు జమ కావాలంటే రైతులు తప్పకుండా e-KYC, భూ రికార్డుల ధృవీకరణ పూర్తి చేసి ఉండాలి.