రూ.10 వేల జీతం కోసం.. రూ.24 కోట్ల వస్త్రాలు దగ్ధం

10707చూసినవారు
రూ.10 వేల జీతం కోసం.. రూ.24 కోట్ల వస్త్రాలు దగ్ధం
గుజరాత్‌ సూరత్‌లోని శ్యామ్‌ సంగిని టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో సెప్టెంబరు 9న జరిగిన భారీ అగ్నిప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. మాజీ అకౌంటెంట్‌ వినోద్‌ పండిట్‌ సావ్లే (33) ఉద్దేశపూర్వకంగా నిప్పంటించినట్లు గుర్తించి అరెస్టు చేశారు. తనకు రావాల్సిన రూ.10 వేల జీతం విషయంలో పగతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబరు 8న అర్ధరాత్రి మార్కెట్‌లోకి ప్రవేశించి వస్త్రాలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు వెల్లడించారు. మంటల్లో సుమారు రూ.24 కోట్ల విలువైన వస్త్రాలు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్