బిట్ కాయిన్ పేరిట రూ.32 లక్షలు బురిడీ
By BS Naidu 15186చూసినవారుTG: బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్లు రూ.32 లక్షలు దోచుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడిని సైబర్ మోసగాళ్లు ముంచేశారు. వాట్సాప్ లింక్ పంపించి, బిట్ కాయిన్‌లో పెట్టుబడితో లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో సదరు వ్యక్తి మొదట రూ.50 వేలు పంపించగా.. వాలెట్‌లో రూ.10 లక్షలు కనిపించేలా గారడీ చేశారు. అలా పలు దఫాలుగా రూ.32 లక్షలు దోచుకున్నారు.