రూ.34 కోట్లు క్షమాధనం.. మరణశిక్ష నుంచి విముక్తి

23చూసినవారు
సౌదీ అరేబియా జైల్లో 20 ఏళ్లపాటు శిక్ష అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ స్వదేశానికి చేరుకున్నారు. 2006లో ఉపాధి కోసం సౌదీ వెళ్లిన రహీమ్, ఒక దివ్యాంగ బాలుడికి కేర్‌టేకర్‌గా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ బాలుడు మరణించాడు. దీంతో రహీమ్‌పై కేసు నమోదైంది. బాలుడి కుటుంబం క్షమాభిక్షకు నిరాకరించడంతో 2018లో ఆయనకు శిక్ష ఖరారైంది. దాదాపు 34 కోట్ల రూపాయల క్షమాధనం చెల్లించాల్సి రాగా, ప్రపంచవ్యాప్త మలయాళీ సమాజం విరాళాల ద్వారా ఆ డబ్బును సేకరించి చెల్లించడంతో రహీమ్ విడుదలయ్యారు. బుధవారం రాత్రి సౌదీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం ఉదయం కేరళలోని కరిపుర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్