టెలికమ్యూనికేషన్ విభాగం మొబైల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. తమ పేరు మీద జారీ అయిన సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వడం, మోసపూరిత సిమ్ జారీ, IMEI నంబర్ల తారుమారు వంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు పాల్పడితే రూ.50 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపింది. పౌరులు సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని సూచించింది.