గుజరాత్‌లోని సూరత్‌లో పట్టపగలే చోరీ జరిగింది. వరాచా ప్రాంతంలో ఉన్న SBI బ్యాంకు శాఖలో పట్టపగలే దుండగులు తుపాకులతో బెదిరించి రూ.50 లక్షలు దొంగిలించారు. దొంగలు ముందుగా అలారం వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఆపై బ్యాంకు సిబ్బంది ఫోన్లను లాక్కొని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో బ్యాంకులో తీవ్ర కలకలం రేగింది.