ఒక్క కోతికి రూ. 600.. ఎన్ని పట్టుకుంటే అంత డబ్బు

57చూసినవారు
ఒక్క కోతికి రూ. 600.. ఎన్ని పట్టుకుంటే అంత డబ్బు
మహారాష్ట్రలో కోతుల బెడద తీవ్రంగా పెరిగిపోయింది. పంట నష్టంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కోతులను సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతాలకు తరలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. కోతులను పట్టుకునే వారికి రూ.600 బహుమతిగా ప్రకటించింది. పట్టుకున్న కోతుల వివరాలను అటవీ శాఖ అధికారులకు సమర్పించి, ఫోటో ఆధారాలతో సహా నమోదు చేసుకున్న తర్వాతే నగదు అందజేస్తారు. క్రూరమైన పద్ధతులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్