TG: జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శివ అనే బైకర్ బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపి బైక్‌ను బయటకు తీసి శివను రక్షించారు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.