ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ.. నలుగురి పరిస్థితి విషమం

5చూసినవారు
TG: ములుగు జిల్లా తాడ్వాయి-పసర గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది బంజారా గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. భద్రాచలం స్వామివారి దర్శనం ముగించుకుని తిరుగుప్రయాణమైన కుటుంబ సభ్యుల బొలెరోను కొండపర్తి స్టేజీ సమీపంలో ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్